ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

Why Doesnt Have Snakes These Countries - Sakshi

పాములు లేని ఊరు, గ్రామం ఉండు. కానీ కొన్ని దేశాల్లో అస్సలు పాము అనేదే కనిపించదట. ముఖ్యంగా ఓ దేశంలో అయితే ఇంతవరకు పాము కనిపించిన దాఖలాలు లేవని తేల్చి చెబుతున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఎందువల్ల అక్కడ పాములు కనిపించవు? రీజన్‌ ఏంటి తదితరాల గురించే ఈ కథనం!.

బ్రిటన్‌ , ఐర్లాండ్‌లో పామలు అస్సలు కనపించవట. అందుకు కారణంగా అతి శీతల ప్రదేశాలు కావడం వల్ల అని అంటుంటారు. గడ్డకట్టే చలిలో ఆ సరిసృపాలు జీవించలేవని అందువల్లే ఇక్కడ పాములు లేవని చెబుత్నున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఒక్క పాము కూడా కనిపించనట్లు రికార్డుల్లో కూడా లేదని చెప్పారు. పురాణాల ప్రకారం క్రీస్తు శకంలో సెయింట్‌ పాట్రిక్‌ అనే క్రైస్తవ మత పెద్ద ఐర్లాండ్‌ ద్వీపం నలుమూలలోని పాములను తరిమేసి సముద్రంలోకి పడేశాడని అందువల్లే ఇక్కడ పాములు ఉండవని కథలు కథలుగా చెబుతుంటారు.

అంతేగాదు సుమారు పదివేల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరిత్యం వల్ల హిమనీనదాలు కరిగిపోవడంతో ఈ ఐర్లాండ్‌ ద్వీపం కొన్నేళ్ల వరకు మునిగిపోయిందని, అందువల్లే పాములు లేవని చెబుతుంటారు. పురావస్తు రికార్డుల ప్రకారం, బ్రిటన్‌, ఐర్లాండ్ దేశాల్లో పాములు లేవని వెల్లడించింది. ఐతే ఆ తర్వాత మరికొన్ని పరిశోధన కారణంగా ఈ దేశాల్లో మూడు రకాల పాము జాతులను గుర్తించారు. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, సాధారణ పాములు వంటి సరీసృపాలు జాతులను మాత్రమే గుర్తించారు. అలాగే న్యూజిలాండ్‌లో కూడా ఒక్క పాము కూడా కనిపించదట. ఇది ఎన్నో రకాల అడవి జంతువులకు నిలయమైన ఇక్కడ కూడా ఒక పాము కూడా కనిపించదట. 

(చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్‌!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top