చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్‌.. వీడియో వైరల్‌ | Sonu Sood Catches Snake With Bare Hands, Video Goes Viral | Sakshi
Sakshi News home page

చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్‌.. వీడియో వైరల్‌

Jul 20 2025 8:17 AM | Updated on Jul 20 2025 10:30 AM

Sonu Sood Catches Snake With Bare Hands, Video Goes Viral

పాము ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కళ్లకు కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. ఇక సినిమా వాళ్లకు పాము అంటే భయం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. వాళ్లు రియల్లైఫ్లో పాములను రేర్గా చూస్తుంటారు. చిన్న బల్లికే భయపడే స్టార్స్చాలా మందే ఉన్నారు. కానీరియల్హీరో’, నటుడు సోనూ సూద్‌(Sonu Sood ) మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నాడు. పాముని చూసి తన సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే.. ఆయన మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకొని..అడవిలో విడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్అవుతుంది.

ముంబైలో సోనూ సూద్నివాసం ఉండే సొసైటీలోకి పాము దారితప్పి వచ్చింది. పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. సోనూ సూద్మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని సంచిలో బంధించాడు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా.. ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలన్నారు. తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement