
భక్తి అనేది పలు రకాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం, దాస్యం అను నవవిధ భక్తి మార్గాలు గురించి విన్నా. కానీ ఇలాంటి భక్తి మార్గాన్ని మాత్రం చూసుండరు. ఆ భక్తి చూస్తేనే షాక్‌కి గురిచేసేలా ఉంటుంది. అలాంటి భక్తి పారవశ్యాన్ని బీహార్‌లో చూడొచ్చు. ఆ భక్తుల అసమాన భక్తికి భయం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలుగుతాయి.
బీహార్‌లోని సమస్తిపూర్‌లోని సింగియా ఘాట్ వందలాది మంది భక్తులతో సందడిగా ఉంది. వారంతా నాగ పంచమి ఉత్సవంలో పాల్గొనడానికి పెద్త ఎత్తున వచ్చారు. అక్కడ మతపరమైన ఆచారంలో భాగంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పాములను ఉట్టి చేతులతో నేరుగా పట్టుకుని వెళ్లే సాంప్రదాయం చూస్తే నోటమాట రాదు.
అక్కడి ప్రజలంతా సింగియా బజార్‌లోని మా భగవతి ఆలయంలోకి ఆ పాములను తీసుకుని వెళ్తున్నారు. వారంతా ఆ పాములును కర్రలకు లేదా తలకు, చేతులకు చుట్టుకుని తీసుకువెళ్తుడటం విశేషం. అది చాలా సర్వసాధారణం అన్నట్లుగా ఆ పాములను చేత్తో పట్టుకుని స్థానిక సర్ప దేవత అయిన మాతా విషరి నామాన్ని జపిస్తూ మా భగవతి ఆలయానికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత పూజలు చేసి వాటిని అటవీ ప్రదేశంలో వదిలేస్తారట.
అక్కడ బిహార్ చుట్టుపక్కల గ్రామలైన ఖగారియా, సహర్సా, బెగుసరాయ్, మిథిలా, ముజఫర్‌పూర్ జిల్లాతో సహా అంతటా ఈ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. విదేశీయలును ఆకర్షించే ప్రధాన ఉత్సవం కూడా ఇదే. అయితే అక్కడ స్థానికులు మాత్రం ఇదంతా సంప్రదాయమని చెబుతుండటం విశేషం. ఊరేగింపుగా పాములను తీసుకొచ్చి పవిత్ర తోటలు లేదా ఆవరణంలో వాటిని ఉంచి పూజలు చేస్తారట.
వారంతా తమ కుటుంబ రక్షణ, ఆరోగ్యం కోసం నాగ దేవతను ఇలా ప్రార్థిస్తారట. కోరికలు తీరిన తర్వాత నాగపంచమి నాడు కృతజ్ఞతగా నైవేద్యాలు నివేదించి ఇలా పాములను చేత పట్టుకుని ఉత్సవం చేస్తారట. అయితే ఇంతవరకు ఈ ఉత్సవంలో అప్పశృతి చోటు చేసుకోలేదట. పైగా ఈ పండుగలో ఇంతవరకు ఎవ్వరికి పాము కాటు, లేదా గాయం అయిన దాఖాలాలు కూడా లేవట. ఆ విచిత్రమైన పండుగకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: పార్లమెంటు క్యాంటీన్‌లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!)