ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా? | Health Tips: Research says the real you comes out under pressure | Sakshi
Sakshi News home page

ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?

Mar 17 2026 7:10 AM | Updated on Mar 17 2026 3:49 PM

Health Tips: Research says the real you comes out under pressure

సాధారణ స్థితిలో ప్రతి ఒక్కరూ మంచే మాట్లాడతారు, ప్రశాంతంగానే ఉంటారు. కానీ, "ఒత్తిడి (Stress) ఉన్నప్పుడు మీరు ఎవరు?" అనేదే మీ అసలైన వ్యక్తిత్వం.

"నేను ఆ టైమ్ లో కోపంగా మాట్లాడాను బ్రో, కానీ నేను చాలా మంచివాడిని" అని చాలామంది అంటారు. సైకాలజీలో దీనిని మనం అంగీకరించలేం. ఎందుకంటే, ఒత్తిడి అనేది మీలోని ముసుగును తీసేసే ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది. ఒత్తిడిలో మీరు అరుస్తున్నారంటే, ఆ కోపం మీలో ఎప్పుడూ ఉన్నదే, అది ఆ సమయంలో బయటపడింది అంతే.

1. ఒత్తిడిలో మెదడు ఏం చేస్తుంది?  

మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులో భయాన్ని నియంత్రించే Amygdala యాక్టివేట్ అవుతుంది. దీన్నే 'Amygdala Hijack' అంటారు. ఆ సమయంలో మన లాజికల్ మెదడు (Prefrontal Cortex) పనిచేయడం ఆగిపోయి, కేవలం మన 'సర్వైవల్ ఇన్స్టింట్స్' (Fight or Flight) మాత్రమే పనిచేస్తాయి.

Fight (పోరాటం): కోపంతో అరవడం, వాదించడం.

Flight (పారిపోవడం): సమస్య నుండి తప్పించుకోవడం, బాధ్యత తీసుకోకపోవడం.

Freeze (స్తంభించిపోవడం): ఏం చేయాలో తెలియక ఆగిపోవడం.

మీరు ఈ మూడింటిలో దేనికి రియాక్ట్ అవుతున్నారో గమనిస్తే, మీ 'ఒత్తిడి వ్యక్తిత్వం' అర్థమవుతుంది.

2. మీ పర్సనాలిటీని ఒత్తిడి ఎలా మార్చేస్తుంది?

ఒత్తిడిలో మీరు మూడు రకాలుగా మారతారు.

The Victim: "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని నిరంతరం బాధపడటం.

The Bully: ఒత్తిడిని భరించలేక ఇతరులను డామినేట్ చేసి, కంట్రోల్ చేయాలని చూడటం.

The Hermit: పూర్తిగా ప్రపంచానికి దూరంగా వెళ్లిపోవడం.

కానీ, Resilient Personality ఉన్న వ్యక్తి మాత్రం ఒత్తిడిలో కూడా నిశ్శబ్దంగా తన పని చేసుకుంటాడు. అతను సమస్యను చూసి భయపడడు, పరిష్కారం కోసం చూస్తాడు.

3. నిజమైన స్ట్రెస్ మేనేజ్‌మెంట్
"ఎప్పుడూ హ్యాపీగా ఉండు, స్ట్రెస్ కి చోటు ఇవ్వకు" అని సోకాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు చెప్తారు. ఇది అసాధ్యం, ఎందుకంటే జీవితం ఉన్నచోట స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మధ్యలో ఉండి కూడా ఎలా ప్రశాంతంగా ఉండాలో సైకాలజీ (Mindfulness & Stoicism) నేర్పిస్తుంది. స్ట్రెస్‌ను పూర్తిగా తొలగించడం కాదు, స్ట్రెస్‌ను 'మేనేజ్' చేయడం నేర్చుకోవాలి.

4. ఒత్తిడిలో కూడా 'మీరు'గా ఉండటం ఎలా?

నా Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఒత్తిడిని మీ పర్సనాలిటీకి ఆయుధంగా మార్చుకోండి.

Step 1: రియాక్షన్ బ్రేక్

ఒత్తిడి మొదలవ్వగానే, ముందుగా శారీరక మార్పులను (గుండె వేగం పెరగడం) గుర్తించండి. వెంటనే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, మీరు 'అమైగ్డాలా హైజాక్' నుండి బయటపడవచ్చు. ఆ 'రియాక్షన్'ని బ్రేక్ చేయడం మీ మొదటి విజయం.

Step 2: స్ట్రెస్ వాల్యుయేషన్

"ఈ ఒత్తిడికి కారణం ఏంటి? ఇది నా కంట్రోల్ లో ఉందా?" అని ప్రశ్నించుకోండి. మీ కంట్రోల్ లో ఉంటే పని చేయండి, లేకపోతే దాన్ని 'లెట్ గో' (Let go) చేయండి. మీ ఎనర్జీని కంట్రోల్ చేయలేని వాటి కోసం వృథా చేయకుండా, కంట్రోల్ చేయగలిగే వాటిపై 'Build' చేయండి.

Step 3: స్టాయిక్ కామ్

తుఫానులో కూడా చెట్టు కదలనట్లు, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీరు మీ సెల్ఫ్-కంట్రోల్ ని కోల్పోకూడదు. ఎవరైతే ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటారో, వారే నిజమైన నాయకులు. ఇదే Beyond స్టేజ్.

5. మీ స్ట్రెస్ రిపోర్ట్

ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.

ఈ వారంలో మీరు ఎక్కడ అతిగా రియాక్ట్ అయ్యారు?

ఆ సమయంలో మీ మెదడు మిమ్మల్ని ఏమని భయపెట్టింది?

ఇప్పుడు ఆ పరిస్థితిని తిరిగి చూస్తే, మీరు ఎలా స్పందించి ఉండాల్సింది?

ఒత్తిడి మీ పర్సనాలిటీకి అద్దం!
బ్రో, ఒత్తిడి మిమ్మల్ని చెడగొట్టదు, అది కేవలం మీ లోపల ఏముందో బయటకు తీస్తుంది. మీ లోపల శాంతి ఉంటే, ఒత్తిడిలో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. లోపల గందరగోళం ఉంటే, ఒత్తిడిలో మీరు నలిగిపోతారు. కాబట్టి బయట పరిస్థితులను మార్చడం కంటే, లోపలి పర్సనాలిటీని నిర్మించడం ముఖ్యమని గుర్తుంచుకోండి.

"It is not the mountain we conquer, but ourselves."  
Edmund Hillary

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement