ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన భారత డిజైనర్‌ వేర్‌లు, ఆభరణాలు..! | At the Oscars Red Carpet Indian jewellery, Designer wear | Sakshi
Sakshi News home page

ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన భారత డిజైనర్‌ వేర్‌లు, ఆభరణాలు..!

Mar 16 2026 1:34 PM | Updated on Mar 16 2026 2:01 PM

At the Oscars Red Carpet Indian jewellery, Designer wear

Credit: Getty Images

సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకలో హాలీవుడ్‌ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పాలుపంచుకుంటారు. అయితే ఈసారి జరిగిన ఆస్కార్‌ వేడుకలో రెడ్‌కార్పెట్‌పై మన భారతీయ ఢిజైనర్‌వేర్‌, ఆభరణాలు తళుక్కుమనడం విశేషం. హాలీవుడ్‌ ప్రముఖులు మన దిగ్గజ ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందిచిన దుస్తులు, ఆభరణాలను ధరించి ఈ వేడకలో కనిపించడం అత్యంత హైలెట్‌గా నిలిచింది. మన భారతీయ ష్యాషన్‌ శైలిని ధరించిన ఆ ప్రముఖులు ఎవరంటే..

ప్రముఖ బ్రిటిష్-అమెరికన్ ఫ్యాషన్ జర్నలిస్ట్, స్టైలిస్ట్,జన్నా రాబర్ట్స్ రాస్సీ ఈ ఆస్కార్‌ వేడుకలో అబుజాని, సందీప్‌ ఖోస్లా రూపొందించిన కోచర్‌ని ధరించారు. భారతీయ వస్త్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే కోచర్‌లో కనిపించారామె. ఈ కోచర్‌ని వేలాది బగల్ పూసలు, రాళ్ళు, స్ఫటికాలతో  ఎంబ్రాయిడరీ చేసిన విలాసవంతమైన క్రాప్‌ టాప్‌. సిల్క్‌ బ్రోకేడ్‌ కాన్వాస్‌పై ఈ డిజైన్‌ని రూపొందించారు. దీన్ని డిజైన్‌ చేయడానికి దారాలను కట్టి రంగులు వేసే సాంప్రదయా సాంకేతికతతో రూపొందిస్తారు. ఇది ఏకంగా రెండు వేల గంటలు శ్రమతో చేసిన చేతి ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌.

జాంబియన్‌  పచ్చ వజ్రం
అంతర్జాతీయ మోడల్, బ్యూటీ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రీతికా స్వరూప్ ఈ వేడుకలో అద్భుతమైన భారతీయ నెక్లెస్‌తో మెరిశారు. ఆమె భారతీయ ఆభరణాల నైపుణ్యాన్ని వ్యక్తరిచేలా ఆస్కార్‌ రెడ్‌కార్పెట్‌పై తళుక్కుమన్నారు. జిప్‌ మాదిరి నెక్‌లైన్‌తో మధ్యలో జాంబియన్‌  పచ్చ వజ్రం ఆ నెక్లస్‌ని హైలెట్‌గా కనిపించేలా చేసింది. ఈ ఆభరణానికి రూపొందించడానికి దాదాపు 160 గంటల శ్రమతో చేతితో రూపొందిస్తారట.

తెలంగాణ హస్తకళాకారులు రూపొందించిన..
బ్రాందీ కార్లైల్ బంగారం, వజ్రాలతో చేతితో రూపొందించిన ప్రిజం బ్రూచ్‌ను ధరించారు. బ్రూచ్ ఓపెన్-సెట్టింగ్ టెక్నిక్ ద్వారా అమర్చబడిన పావ్-సెట్ వజ్రాలతో డిజైన్‌ చేశారు. ఇది రాళ్ల ద్వారా కాంతి స్వేచ్ఛగా కదలడానికి వీలు కల్పిస్తోంది. దీన్ని తెలంగాణలోని నిపుణులైన స్వర్ణ హస్తకళాకారులు సుమారు 100 గంటలు శ్రమింది డిజైన్‌ చేస్తారట. ఈ వజ్రాల నెక్లెస్‌ మన భారతదేశ హస్త కళా వారసత్వ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.

(చదవండి: ఆస్కార్‌ ఫుడ్‌ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement