బైక్‌ ఆఫ్ అవ‌డంతో బైక్‌ సీటు తెరిచి చూస్తే.. ఒక్క‌సారిగా షాక్‌! | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఆఫ్ అవ‌డంతో బైక్‌ సీటు తెరిచి చూస్తే.. ఒక్క‌సారిగా షాక్‌!

Jan 8 2024 12:38 AM | Updated on Jan 8 2024 8:01 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: బైక్‌ ఆఫ్‌ అయితుందని మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్లిన యువకులకు సీటు కింద పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన బాలు, వినయ్‌ అక్కడే ఓ పరిశ్రమలో పని చేసేవారు. కంపెనీ పని మీద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తాడిపత్రికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో కర్నూల్‌ వద్ద బైక్‌లో పెట్రోల్‌ పోయించుకున్నారు. అడ్డాకుల సమీపంలోకి రాగానే బైక్‌ ఆఫ్‌ అయితుండటంతో స్థానికంగా ఉన్న మెకానిక్‌ దగ్గరికి వచ్చారు. దాన్ని బాగు చేసే క్రమంలో బైక్‌ సీటు తీయగా దాని కింద పాము కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత యువకులంతా కలిసి దాన్ని బయటకు తీసి చంపేశారు.

ఇవి చ‌ద‌వండి: ఆన్‌లైన్‌లో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్ బుక్‌.. తెరిచిచూస్తే షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement