ఉద్యోగం కోసం ఎన్నోసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేశాం.. అయినా ఇంతవరకు స్పందన లేదు. ఆ రోడ్డు ప్రమాదంలో మా నాన్న శివాజీ, అమ్మ చాందిని చనిపోయారు. నాకు ఇద్దరు అక్కలు అనుష, సరిత ఉన్నారు. వారి పెళ్లిళ్లు చేశాం. ప్రమాదంలో అమ్మానాన్న చనిపోయినప్పుడు మా అక్క డీఈడీ పూర్తి చేసింది. అప్పుడు మాకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దానికోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ, ప్రజావాణి చుట్టూ తిరిగినా ఫలితం లేదు. నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. – సంతోష్, గోగ్య తండా
●


