
సాధారణంగా పాము కరిచి ప్రజలు మృత్యువాత పడిన ఘటనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనిషి కరిస్తే పాము చచ్చిపోతుందా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ తరహా ఘటనలు జరిగినా అరుదనే చెప్పాలి. మరి ఏడాది వయస్సున్న చంటోడు కోబ్రాను కొరికితే అది చచ్చిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోబెట్టాహ్ జిల్లాలోని వెస్ట్ చాంపరన్‌లో చోటుచేసుకుంది.
ఆ బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కోబ్రా వచ్చింది. అయితే అది ఆట వస్తువు అనుకున్న ఆ పిల్లాడు.. దాన్ని గట్టిగా పట్టుకుని ఒక పట్టుపట్టాడు. ఆ పామును కోరిక పారేశాడు. దాంతో ఆ పాము చనిపోవడం ఇప్పుడు షాకింగ్ ఘటనగా మారిపోయింది. పామును కరిచిన తర్వాత ఆ చంటోడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కలేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లాడ్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలనే డాక్టర్ల సూచన మేరకు అక్కడే ఉంచారు.
ఆ పిల్లాడి అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం.. ఒక పొడవాటి కోబ్రా ఇంట్లోకి వచ్చిందని, ఆ సమయంలో పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడని, ఆ పామును ఆట వస్తువు అనుకుని దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని నోటితో కొరికినట్లు చెప్పారు.