Weird Ritual: Snakes Are Given As Dowry In This Community Of Madhya Pradesh, Know In Details - Sakshi
Sakshi News home page

Where Snakes Given As Dowry: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు..

Jul 22 2023 3:05 PM | Updated on Jul 22 2023 3:47 PM

Snakes Are Given As Dowry In This Community - Sakshi

రాయ్‌పుర్‌: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వధువు తల్లిదండ్రులు తోచినంత కట్నం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా మనం చూసినంతవరకు కట్నంగా డబ్బులు, బంగారం, భూములు వంటి ఆస్తులను వరునికి కానుకగా ఇస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఓ తెగ ప్రజలు చాలా వింత ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు. కట్నంగా వారు పాములను వరునికి కట్నంగా ఇస్తారు. 

ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగ ప్రజలు వింతైన ఆచారం పాటిస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసేప్పుడు వరునికి పాములను కట్నంగా ఇస్తారు. కనీసం తొమ్మిది రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇచ్చేస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఎవరూ వివాహం చేసుకోరు. తమ పూర్వికులు కనీసం 60 పాములను కట్నంగా ఇచ్చేవారని ప్రస్తుతం ఆ సంఖ్య క్రమంగా తగ్గినట్లు ఆ తెగకు చెందిన ఓ సభ్యుడు కటంగీ తెలిపారు. పాములను కట్నంగా ఇవ్వండం తమ ఆచారంగా వస్తోందని వెల్లడించారు. 

కన్వారా తెగ ప్రజలు తమ పూర్వికుల నుంచి కూడా పాములను ఆడిటడం జీవనాధారంగా చేసుకున్నారు. వివిధ రకాల పాములను పట్టుకుని వాటిని ఆడిస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తారు. పాములనే తమ ఆస్తిగా భావిస్తారు. అందుకే ఆడపిల్లకు కట్నంగా పాములనే ఇస్తుంటారు. విషరహిత పాములనే పట్టుకుని జీవనం సాగించాలని అటవీ అధికారులు తెగ ప్రజలకు సూచించారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజి అధికారి సియారామ్‌ కర్మాకర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్‌ బుక్‌ చేసుకున్న మహిళకు చేదు అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement