
నాగర్‌కర్నూల్ జిల్లా: మండలంలోని ఎల్లూరుకుకి చెందిన యువకుడు గణేశ్ బైక్‌లో కట్లపాము దాక్కుంది. ఎల్లూరు నుంచి కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గణేశ్ ప్యాషన్‌ప్లస్ బైక్‌పై గురువారం ఉదయం భయలుదేరాడు. పట్టణంలోని ద్వారకా లాడ్జ్ ముందు రోడ్డుపై వెళ్తుండగా బైక్ ముందు భాగంలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది.
అనుమానం వచ్చి బైక్‌ను ఆపుకొని చూడగా కట్ల పాము కనిపించింది. దాన్ని భయటకు తీసేందుకు కొద్దిసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని మెకానిక్ షాపు వద్దకు తీసుకెళ్లాడు. మెకానిక్ సద్దాం బైక్ పార్ట్స్ విప్పి పామును భయటికి లాగాడు. ఈ పాము దాదాపు మూడున్నర ఫీట్ల మేర పొడవు ఉంది. రాత్రి ఇంటిముందు పార్కుచేసిన సమయంలో బైక్‌లోకి పాము ఎక్కి ఉండొచ్చని గణేశ్ చెప్పాడు. పామువల్ల ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.