పోలీసుల చేతికి చిక్కిన హవాలా ముఠా.. రూ. 4 కోట్లు స్వాధీనం | Hawala Gang Arrested By Bowenpally Police Hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసుల చేతికి చిక్కిన హవాలా ముఠా.. రూ. 4 కోట్లు స్వాధీనం

Dec 5 2025 7:22 PM | Updated on Dec 5 2025 7:45 PM

Hawala Gang Arrested By Bowenpally Police Hyderabad

హైదరాబాద్:  హవాలా ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.   ఏడాది కాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఈ ముఠాలోనిఇద్దరు సభ్యులను పోలీసులు గురువారం(డిసెంబర్‌ 5వ తేదీ) అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి(30), ప్రజ్ఞేశ్ కీర్తిభాయ్ ప్రజాపతి(28)లను ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 కోట్లకు పైగా నగదును ప్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఈ మేరకు నార్త్‌ జోన్‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌ మీడియా సమావేశంలో హవాలా నిందితుల్ని అరెస్ట్‌ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. 

గతేడాది డిసంబర్‌ 7వ తేదీన నాగోల్‌కు చెందిన వి విశ్వనాథ్‌ చారీ అనే వ్యక్తి .. తన స్నేహితులతో కలిసి రూ. 50 లక్షలను మోసపోయినట్లు బోయినపల్లి పోలీస్‌ స్టేషనల్‌లో ఫిర్యాదు చేశారు. క్యాష్‌ను ఆర్టీజీఎస్‌లో మార్చతామని వారు నమ్మబలికి విశ్వనాథ్‌ చారీని మోసం చేశారు హవాలా కేటుగాళ్లు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎట్టకేలకు  హవాలా ముఠా సభ్యుల్లో ఇద్దర్ని అరెస్ట్‌ చేసి భారీ మొత్తాన్ని రికవరీ చేశారు. 

నిందితులిద్దరూ గుజరాత్‌కు చెందిన వారే. వీరు నగదును మార్చడాన్ని వ్యాపారంగా చేసుకుని ఇలా మోసాలకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్‌ చారీ, ఆయన స్నేహితుల్ని బురిడీ కొట్టించి రూ. 50 లక్షలు దోచుకున్నారు. అయితే వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. హుండాయ్‌ క్రెటా కారులో వెళుతున్న సమయంలో వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితుల్ని పట్టుకున్న టీమ్‌ను నార్త్‌జోన్‌ డీసీపీ  రష్మీ పెరుమాల్‌ అభినందించారు. తాము దోచుకున్న నగదు రూ.  4.05 కోట్లను నాగ్‌పూర్ నుండి బెంగళూరుకు హవాలా రూపంలో బదిలీ చేయడంలో తన ప్రమేయం ఉందని ప్రకాష్‌ ప్రజాపతి విచారణలో అంగీకరించాడు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement