కేసీఆర్‌పై దుర్మార్గ వైఖరి.. అర్థరాత్రి గేటుకు నోటీసులా?: కేటీఆర్‌ ఫైర్‌ | BRS KTR Serious Comments On Revanth Govt On Notice Issue | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై దుర్మార్గ వైఖరి.. అర్థరాత్రి గేటుకు నోటీసులా?: కేటీఆర్‌ ఫైర్‌

Jan 31 2026 12:04 PM | Updated on Jan 31 2026 5:13 PM

BRS KTR Serious Comments On Revanth Govt On Notice Issue

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్‌ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.

65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. 

KTR: రాత్రి పూట వచ్చి నోటీసులు అంటిస్తారా?

 

Advertisement
 
Advertisement
Advertisement