
వైరల్ అయిన ‘ఫేక్ మెనూ’
అవాక్కయ్యారా!.. ఈ పేర్లన్నీ మన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ (2019), ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ దెబ్బ తగిలిన పాకిస్థాన్ ప్రాంతాల పేర్లే కదూ అనిపించిందా! మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93వ వార్షికోత్సవం సందర్భంగా, ఒక ఫేక్ మెనూ సోషల్ మీడియాలో వైరలైంది.. దేశం మొత్తం గట్టిగా నవ్వుకునేలా చేసింది! ఈ మెనూని తయారుచేసింది ఎవరో కాదు, మన ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఈ ఏఐకి, ఆ మెనూ పేర్లు పెట్టిన మన సైనికులకు పద్మశ్రీ ఇవ్వొచ్చు!. మెనూ చూడగానే, ’అమ్మో! ఎంత ఘాటుగా ఉందో!’ అనిపించేలా ఉంది. ఆ మెనూలో ఉన్న పేర్లు చదివితే, మనోళ్లు మామూలోళ్లు కాదు సుమీ.. అనిపించక మానదు. ఆ మెనూలో పాకిస్థాన్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారంతే..! ఇవి చదివాక.. ’ఆహో! వంటకాల పేర్లలో కూడా మన సైన్యం సత్తా చాటిందే!’ అనుకున్నారంతా.
బహావల్పూర్ నాన్.. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా
మెయిన్ కోర్సుగా బహావల్పూర్ నాన్, రావల్పిండి చికెన్ టిక్కా మసాలా పెట్టారు.. వారి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్టు.. మురిద్కే, ముజఫరాబాద్ పేర్లతో చేసిన డెసర్ట్‌లు వడ్డించారు. ‘మా విందులో మీకు ఘాటుగా టిక్కా మసాలా ఉంది, తీయగా తిరామిసు ఉంది. కానీ మాకు మాత్రం... మీ టెర్రర్ క్యాంపులు నాశనం చేసిన కిక్ ఉంది!’ అన్నట్టుగా ఉంది ఈ ఫేక్ మెనూ వెనుక ఉన్న ‘పకడ్బందీ ప్లాన్’! ఈ మెనూ చూసి సైనికులు, ఆర్మీ వెటరన్స్ కూడా పగలబడి నవ్వారంటే, దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు!
మన సైనికుల సెటైర్ సూపరెహే..
‘షెహబాజ్’ అంటే.. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకోవడం. ఇక, ‘రఫీఖీ’ అనేది పాకిస్థాన్‌లోని ఓ ముఖ్యమైన ఎయిర్ బేస్ పేరు. ఆపరేషన్ సింధూర్‌లో మన సైన్యం ఆ ఎయిర్ బేస్‌ను కూడా దెబ్బ కొట్టింది. అంటే, ‘షెహబాజ్ గారూ.. మీ రఫీఖీ బేస్‌ను కొట్టేశాం’.. అని గాలిలోనే సరదాగా వారి్నంగ్ ఇచ్చినట్టు ఉందీ వ్యవహారం. ఏఐ పుణ్యమా అని వైరలైన ఈ ఫేక్ మెనూ, సరదాగా చేసిన ఈ విమానాల నామకరణం చూస్తే.. మన సైనికుల ఫైటింగ్ స్పిరిట్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు యుద్ధంలోనే కాదు, సెటైర్ వేయడంలోనూ దిట్ట!. మరి ఈ ఫన్నీ మెనూ చూశాక మీకేం అనిపించింది?.. మీరూ.. కొత్త ‘శత్రువుల కడుపు మంట’ వంటకాలు కనిపెట్టారా?
విమానాలకు కూడా ‘పేరు’!
ఇక, విందు మెనూతో పాటు, అంతకంటే ఫన్నీగా జరిగిన ఇంకో విషయం ఉంది. ఐఏఎఫ్ డేకి ముందు.. ఆకాశంలో కనిపించిన రెండు విమానాలకు పెట్టిన సంకేత నామాలు చూస్తే, ఇక నవ్వు ఆపుకోవడం ఎవరి వల్లా కాదు.
ఇ130ఒ విమానం సంకేత నామం: ‘రఫీఖీ’
అn32 విమానం సంకేత నామం: ‘షెహబాజ్’
– న్యూఢిల్లీ