
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో చొటుచేసుకున్న ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని లక్షిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.ఈ దాడులకు పాక్ వణికి పోయిందనడానికి నిదర్శనంగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలువడ్డాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ నావికాదళం భయంతో ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధనౌకలు ప్రధాన నావికా స్థావరాల నుండి తరలించడాన్ని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని నౌకలను కరాచీ వాణిజ్య రేవులకు తరలించారు. మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ సరిహద్దుకు తరలించారు.
పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యలలో ఆపరేషన్ సింధూర్ ప్రముఖమైనదిగా నిలుస్తుంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ప్రతి రోజూ కొత్త నివేదికలు అందుతున్నాయి. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నావికాదళం ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని చూపిస్తున్నాయి.
మే 7- మే 10 మధ్య భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అ సమయంలో భారత్‌కు తగిన సమాధానం ఇచ్చామని పాకిస్తాన్ గతంలో వాదనకు దిగింది.అయితే ఇప్పుడు ప్రత్యక్షమైన శాటిలైట్ చిత్రాలు దీనికి భిన్నమైన తీరును చూపిస్తున్నాయి. పాకిస్తాన్ తన నావికాదళాన్ని సురక్షితంగా ఉంచేందుకు వెనక్కి తగ్గినట్లు ఈ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. మే 8న భారత్ దాడుల తరువాత రోజున పాక్ యుద్ధనౌకలు వాటి సాధారణ ప్రదేశాలలో కనిపించలేదు. మూడు యుద్ధనౌకలు కరాచీ వాణిజ్య నౌకాశ్రయంలో కనిపించాయి.