భారత్‌-పాక్‌ యుద్ధం, సింధూ జలాలపై షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు | Pak PM Over Action India Slams Sharif Remarks At UN | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ యుద్ధం, సింధూ జలాలపై షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Sep 27 2025 8:11 AM | Updated on Sep 27 2025 8:13 AM

Pak PM Over Action India Slams Sharif Remarks At UN

న్యూయార్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌, సింధూ నదీ జలాలపై పాకిస్తాన్‌(Pakistan) ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌(Shahbaz Sharif) సంచలన ఆరోపణలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని షరీఫ్ ఐక్యరాజ్య సమితి(UN) వేదికగా ఆరోపించారు. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని.. ఇది యుద్ధ చర్యకు సమానం అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) చొరవ ప్రశంసనీయం అంటూ మెచ్చుకున్నారు.

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 80వ సమావేశాలకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ..‘ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న సాహసోపేత నాయకత్వ చొరవ ప్రశంసనీయం. ట్రంప్‌ చర్యలు, నిర్ణయాలతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు ట్రంప్‌ నిజాయతీగా కృషి చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నారు. బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ట్రంప్‌ దూరదృష్టి గల నాయకత్వంలో కాల్పుల విరమణకు పాకిస్తాన్‌ అంగీకరించింది. ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే భారత్‌-పాక్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగేది. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్‌ చేసిన విశేష కృషికి గాను పాక్‌.. ఆయన పేరును నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేసింది’ అని చెప్పుకొచ్చారు.  

అనంతరం, సింధూ జలాలు, కశ్మీర్‌ అంశంపై షరీఫ్‌ స్పందిస్తూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసింది. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇది యుద్ధ చర్యతో సమానం. కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం ఐరాస ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలి. ఉగ్రవాదాన్ని పాక్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీటీపీ, బీఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం’ అని తెలిపారు.

షరీఫ్‌ వ్యాఖ్యలకు భారత్‌ కౌంటర్‌.. 
మరోవైపు షరీఫ్‌ వ్యాఖ్యలను భారత్‌ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో భారత్‌ స్పందిస్తూ..‘పాకిస్తాన్‌ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఐరాసలో బాధిత దేశంగా నటించే పాక్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్‌ కోరింది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని డిమాండ్‌ చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement