ప్రముఖ ఫ్రెంచ్ భవిష్యవేత్త నోస్ట్రడామస్ రాబోయే 2026కు సంబంధించి చేసిన సంచలన అంచనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతూ, అందరిలో వణుకుపుట్టిస్తున్నాయి. ‘న్యూస్ 24’ కథనం ప్రకారం నోస్ట్రడామస్ అంచనా వేసిన భయానక పరిణామాలు, ముంచుకొస్తున్న విపత్తుల వివరాల్లోకి వెళితే..
2026 మధ్యకాలంలోలో మూడవ ప్రపంచ యుద్ధం?
నోస్ట్రడామస్ జోస్యం ప్రకారం 2026 మధ్యకాలం నాటికి మూడవ ప్రపంచ యుద్ధం (World War III) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది అత్యంత వినాశకరంగా మారుతుందని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. మతం, జాతీయవాదం పేరుతో జనం ఒకరినొకరు చంపుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తూర్పు దేశాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం.
సముద్ర యుద్ధాలు - రాజకీయ మార్పులు
నోస్ట్రడామస్ అంచనాల ప్రకారం.. 2026లో జరిగే భారీ నౌకాదళ ప్రమాదం లేదా సముద్ర యుద్ధం ప్రపంచాన్ని కుదిపేయనుంది. ఒక భారీ నౌక మునిగిపోవడం లేదా నౌకాదళాల మధ్య పోరు ప్రారంభమై అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగి, అగ్రరాజ్యాల మధ్య ఘర్షణకు దారితీయవచ్చు. సముద్రంలో నౌక మునిగిన రోజున.. ఆ సముద్ర శక్తి ప్రపంచ రాజకీయాల గమనాన్ని మారుస్తుందని నోస్ట్రడామస్ తన పద్యాలలో పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభం- సామాజిక అశాంతి
2026లో అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నోస్ట్రడామస్ అంచనా వేశారు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగి, సామాజిక అశాంతికి దారితీయవచ్చు. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతల పదవులు చేజారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రకృతి ప్రకోపం: తీవ్రమైన ఎండలు, వరదలు
పర్యావరణ పరంగా కూడా 2026 అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోంది. నోస్ట్రడామస్ తెలిపిన వివరాల ప్రకారం తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల పలు ప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలతో భీకర వరదలు సంభవిస్తాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల పర్యావరణానికి, మానవజాతికి అపార నష్టం వాటిల్లుతుందని ఈ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు అంచనా వేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం
రాబోయే కాలంలో సాంకేతిక రంగంలో వచ్చే కీలక మార్పులను ఆయన ముందే ఊహించారు. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సలహాదారుగా మాత్రమే కాకుండా, నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు, అన్ని వ్యవస్థలు ఏఐ నియంత్రణలో నడిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
అణు దాడి- అంతరిక్ష కార్యక్రమాల పతనం
మరో భయానక అంచనా ప్రకారం.. 2026లో అణు దాడి జరిగే అవకాశం ఉంది. ఇది మానవజాతి అంతరిక్ష పరిశోధనలపై ప్రభావం చూపనుంది. ‘మార్స్’పై చీకట్లు కమ్ముకుంటాయని, అలాగే ఒక ప్రముఖ దేశం అణు దాడికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.
ఆహార ధాన్యాల ధరల పెరుగుదల
నోస్ట్రడామస్ అంచనాల్లో గోధుమలు, ఇతర ఆహార ధాన్యాల ధరల పెరుగుదల కూడా ఉంది. ఆయన పద్యాల్లో నిర్దిష్టమైన తేదీలు లేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నోస్ట్రడామస్ చెప్పిన ఈ అంచనాలు చాలా వరకు అస్పష్టంగా ఉంటాయని, వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నోస్ట్రడామస్ అంచనాలకు దగ్గరగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఉన్నాయని పలువురు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్ హీరో..


