
వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సంజయ్ కపూర్ ఆకస్మికమరణంపై ఆమె తల్లి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మరణించిన నెల రోజుల తర్వాత తన కొడుకు మరణాన్ని అనుమానాస్పదం అని పేర్కొంటూ కొన్ని దిగ్భ్రాంతికర వాదనలు చేశారు. సంజయ్ మరణం తర్వాత ప్రజలు, కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
సోనా కామ్‌స్టార్ మాజీ ఛైర్మన్ సంజయ్ కపూర్ (కెనడాలో జూన్ 12న) పోలో ఆడుతూ మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తేనెటీగ కుట్టడం వలన గుండెపోటు వచ్చి చివరికి అతని మరణం సంభవించిందని వార్తలొచ్చాయి. తాజాగా ఆయనతల్లి రాణి కపూర్ తన కొడుకు ఆకస్మిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
కొడుకు మరణం అనుమానాస్పదం,
అంతేకాదు సోనా కామ్‌స్టార్‌వార్షిక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయమని కోరుతూ లేఖ రాశారు. తన కొడుకు మరణంపై అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని వాపోతోంది. తన ఏకైక కుమారుడు మరణంపై వచ్చిన వార్తలన్నీ ఊగాహానాలేనని, యూకేలో చెప్పుకోలేని పరిస్థితులలో చనిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సార్లు అడిగినా తన కొడుకు మరణానికి సంబంధించిన వివరాలు అందండం లేదు. సంబంధిత సమాధానాలు, పత్రాలు నాకు అందలేదు. ఇంత దుఃఖంలో కొంతమంది కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు
అంతేకాదు సంజయ్ కపూర్‌కు ఖాతాలకు యాక్సెస్‌ను కూడా నిరాకరించారట. సంజయ్ మరణించిన ఒక నెలలోనే ఎంపిక చేసిన కొద్దిమందికే దీనికి అవకాశం కల్పించారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తనకు అర్థం కాని పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారని కూడా పేర్కొన్నారు. ఏమి రాసి సందో అర్థం చేసుకునేంత భావోద్వేగ స్థితిలో తాను లేనని, తీవ్ర మానసిక, మానసిక వేదన పడుతోంటే, నాలుగ్గోడల మధ్య పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశానంటూ షాకింగ్ వాదనలు చేశారు.
ఏజీఎం ఆపాలని లేఖ, లేని పక్షంలో కేసు అవుతుందని హెచ్చరిక
తన దివంగత భర్త సురీందర్ కపూర్ ఎస్టేట్‌కు ఏకైక లబ్ధిదారురాల్ని తానేని, సోనా కామ్‌స్టార్‌తో సహా సోనా గ్రూప్‌లో మెజారిటీ వాటాదారుని రాణీ తన లేఖలో పేర్కొన్నారు. సంజయ్ కపూర్ తల్లిగా మాత్రమే కాకుండా, కపూర్ కుటుంబ అధిపతిగా, కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా తాను వ్రాస్తున్న ఈ లేఖను బోర్డు,వాటాదారులు నిర్లక్ష్యం చేస్తే కంపెనీ యొక్క దుర్వినియోగం నమ్మక ఉల్లంఘన కేసు అవుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.మరోవైపు AGM ఇప్పటికే ప్రారంభమైందని, సంజయ్ కపూర్ భార్య ప్రియా సచ్‌దేవ్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.
కాగా పలు నివేదిక ప్రకారం, రూ. 39 వేల కోట్ల ఆస్తిని సంజయ్ కపూర్, అతని ఇద్దరు సోదరీమణులు, సూపర్నా మోట్వానే , మందిరా కపూర్ మధ్య విభజించే అవకాశం ఉంది. దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, సంజయ్ తన సోదరి మందిరాతో గత నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది. ఇది ఇలా ఉంటే సంజయ్‌మరణం తరువాత అతని మూడవ భార్య ప్రియా సచ్‌దేవ్‌ను కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జెఫ్రీ మార్క్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.