తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్‌ | Taiwan Earthquake Of Magnitude 7, Second This Week | Sakshi
Sakshi News home page

తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్‌

Dec 28 2025 7:13 AM | Updated on Dec 28 2025 7:33 AM

Taiwan Earthquake Of Magnitude 7, Second This Week

తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలిపోయాయని.. 73 కి.మీ (45 మైళ్ళు) లోతున భూకంపం సంభవించిందని వాతావరణ శాఖ యంత్రాంగం తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల మేరకు.. తైవాన్‌ ఈశాన్య తీర నగరమైన యిలాన్‌కు సుమారు 32 కి.మీ దూరంలో శనివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా రాజధాని తైపేలో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది. బుధవారం 6.0 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల అనంతరం ఈ వారంలో ఆ ద్వీపాన్ని తాకిన రెండో భారీ భూకంపం ఇది.

 

కాగా, తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ దగ్గర ఉంది. భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేయలేదని తైవాన్ అగ్నిమాపక శాఖ తెలిపింది. భవనాలు కంపిస్తుండగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2,000 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం మరణాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement