
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బిగ్‌బాస్ 19వ (Bigg Boss 19) సీజన్ తొలి వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్.. హౌస్‌లో ఉన్న కంటెస్ట్‌ల తీరును ప్రశ్నించారు. కొంతమంది కంటెస్టులు వివాదాలకు ఆజ్యం పోస్తుంటారు.పైకి మాత్రం శాంతిదూతలుగా నటిస్తుంటారని అని మండిపడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే? ఈ ప్రపంచంలో ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్న వారే తమకు నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటుంటారు’అని ఎద్దేవా చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్ ఫర్హానా భట్ గురించి మాట్లాడారు.‘తనను తాను శాంతి దూతగా చెప్పుకునే ఫర్హానా.. అందుకు అనుగుణంగా లేదు. ఆమె తరచుగా కంటెస్టెంట్‌ల మధ్య తగాదాలను ప్రేరేపించడం,అనవసరమైన సమస్యలను సృష్టిస్తుంది. అంటూ (‘యే హో క్యా రహా హై? పూరీ దునియా మే జో సబ్సే జ్యాదా ట్రబుల్ ఫైలా రహే హైం, ఉంకో హై శాంతి బహుమతి చాహియే’). శాంతి దూతలని చెప్పుకునే తిరేవారు గొడవలు పరిష్కరించి,ప్రజలను కలిపే వ్యక్తి కావాలి. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా?. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సమస్యలు సృష్టించే వాళ్లే శాంతి బహుమతులు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ పేరును సల్మాన్ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా అధ్యక్షుడిపైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Megastar #SalmanKhan trolling Donald Trump 😂😭 #BiggBoss19
"Is Dunia me jo sabse jyada trouble faila rahe h, unhe hi peace prize chahiye" pic.twitter.com/Z4SfUNm1Lb— MASS (@Freak4Salman) September 7, 2025
నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ ఆశలపై భారత్ నీళ్లు చల్లింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్‌ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందనే అక్కుసతో భారత్‌పై టారిఫ్‌లు మోపుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నా అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారత్‌పై ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవని హైలెట్ చేసింది.