
ఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తరగతి గదుల్లో పిల్లలు చదువుకునే పాఠాల్లోకి రావడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇది తరతరాలు గుర్తుపెట్టుకునే దిశగా ఉండేందుకు వీలుగా ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) సిలబస్‌లో ఆపరేషన్ సిందూర్ ను పాఠ్యాంశంగా చేర్చేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి.
దీన్ని స్పెషల్ క్లాస్‌రూమ్ సిలబస్’గా ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఎన్సీఈఆర్టీ. మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఈ సిలబస్‌ను ప్రవేశ పెట్టాలనే దిశగా కసరత్తు జరుగుతుంది. దీన్ని రెండు భాగాలుగా విభజించి.. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఒక పార్ట్‌గా, తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ రెండో పార్ట్‌గా విభజించి సదరు సిలబస్‌లో చేర్చడానికి ఎన్సీఈఆర్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాద ముప్పులకు దేశాలు ఎలా స్పందిస్తాయో అనే అంశంతో పాటు జాతీయ భద్రతలో రక్షణ, దౌత్యం మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఎలాంటి పాత్ర పోషిస్తాయో అనేది విద్యార్థులకు చేరువ చేయడమే ఈ సిలబస్ యొక్కు ముఖ్య ఉద్దేశంగా సమాచారం.