
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్‌లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తమ మాటలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఆపరేషన్ సిందూర్‌పై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.
లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోదీ తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు?,
ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోదీ చూపించలేదు.భారత సైన్యం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే. పహల్గామ్ సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. మరి ట్రంప్‌తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్-మునీర్‌ల లంచ్ విషయాన్ని మోదీ ఎందకు ఖండించలేదు?, జై శంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది?