breaking news
parliament sassions
-
యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు.. కానీ: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఓట్ చోరీ అంశంపై అటు ఈసీనీ, ఇటు కేంద్రాన్ని విమర్శిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటిచినట్లు తెలుస్తోంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్‌లో ఎన్డీఏ నేతలతో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌లో యువత టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది యువ కాంగ్రెస్ నాయకుల్లో మంచి టాలెంట్ ఉంది. యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు. కానీ వారికి మాట్లాడే అవకాశం రావడం లేదు. దాన్ని రాహుల్ గాంధీనే కల్పించడం లేదు. రాహుల్ గాంధీ అభద్రతా భావంతో ఉన్నట్లు ఉన్నారు. ఇది ‘‘ కుటుంబ అభద్రతాభావం’’ అయి ఉండొచ్చు’ అని ఎన్డీఏ నేతలతో మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎక్కువ శాతం నిరసనలతోనే సభ గడిచింది. బీహార్‌లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టేసింది. జాబితా నుంచి 65 లక్షల ఓటర్ల తొలగింపుపై చర్చ చేపట్టాలని వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేశాయి.నేడు లోక్‌సభకు ప్రధాని మోదీ వచ్చారు. కానీ విపక్షాలు మాత్రం తమ పట్టువీడలేదు. విపక్షాల తీరుతో విసుగెత్తిన స్పీకర్ ఓం బిర్లా .. సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ప్రైవేటీకరణ బాటలోనే విశాఖ స్టీల్ ప్లాంట్
ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తాము వెనక్కి తగ్గే యోచనలో లేమనే విషయాన్ని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 100 శాతం పెట్టబడుల ఉపసంహరణ ఉంటుందన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌న సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటివరకూ 1017 మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ఆర్ఐఎన్ఎల్కు రూ. 11,140 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఇప్పటివరకూ రూ. 984 కోట్లను విడుదల చేశాం’ అని మంత్రి తెలిపారు. -
సవరణపై సభా సమరం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ క్రతువును తక్షణం నిలిపివేయాలన్న విపక్షాల డిమాండ్లతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. గురువారం ఉదయం రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలవగానే విపక్షసభ్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల చర్యకు ప్రధాని మోదీ ఎందుకు రాజ్యసభలో సమాధానం ఇవ్వలేదని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ వెంటనే ఆపేయాలనీ విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు. దీంతో సభను సభాధ్యక్షుడు మధ్యా హ్నం 2 గంటలవరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే విపక్షాల డిమాండ్ల పర్వం కొనసాగింది. వెంటనే ప్రధాని మోదీ సభకు వచ్చి ఆపరేషన్ సిందూర్‌పై సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు సభాధ్యక్షుడు సస్మిత్ పాత్రా అనుమతించారు. ‘‘ 2008లో ముంబై ఉగ్రదాడులపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో వివరణ ఇవ్వనప్పుడు నాట హోం మంత్రి వివరణ ఇచ్చారు. అంతేగానీ హోం మంత్రి అమిత్ షా లాగా ‘‘ నేనొక్కడినే మీ అందరినీ అదమాయించగలను. హ్యాండిల్ చేస్తాను’’ అని అందర్నీ తూలనాడలేదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని ఖర్గే డిమాండ్‌చేశారు. ఈయన మాటలకు విపక్షసభ్యులు గొంతు కలిపారు. దీంతో చేసేదిలేక సభను సాయంత్రం నాలుగున్నర గంటలదాకా వాయిదావేశారు. 4.30 గంటలకు సభ మొదలయ్యాక ట్రంప్ చేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు వాణిజ్యమంత్రి గోయల్ ఘాటుగా స్పందిస్తూ ప్రకటనచేశారు. అయినాసరే విపక్షసభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో చివరకు సభను శుక్రవారానికి వాయిదావేశారు. లోక్‌సభలోనూ అదే తీరు..లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. లోక్‌సభ ఉదయం మొదలుకాగానే జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు సభ అభినందించింది. తర్వాత వెంటనే బిహార్ అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు మొదలెట్టారు. ‘‘ ఇలా నినాదాలు చేయడానికి మనల్ని ఓటర్లు ఓట్లేసి గెలిపించుకున్నారా? దయచేసి మీమీ సీట్లలో కూర్చోండి’’ అని లోక్‌సభ స్పీకర్ బిర్లా మందలించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. తొలుత రెండు గంటల దాకా సభ వాయిదాపడింది. తర్వాత ఇదే పునరావృతంకావడంతో అప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చన్న అవదేశ్ ప్రసాద్ సభను నాలుగు గంటలకువాయిదావేశారు. నాలుగు గంటలకు సభ మొదలవగానే మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడారు. ఆ తర్వాత నినాదాలు కొనసాగడంతో స్పీకర్ బిర్లా సభను శుక్రవారానికి వాయిదావేశారు. -
మన సైనికుల్ని యుద్ధానికి పంపి.. వారి చేతులు కట్టేశారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తమ మాటలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఆపరేషన్ సిందూర్‌పై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోదీ తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు?, ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోదీ చూపించలేదు.భారత సైన్యం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే. పహల్గామ్ సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. మరి ట్రంప్‌తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్-మునీర్‌ల లంచ్ విషయాన్ని మోదీ ఎందకు ఖండించలేదు?, జై శంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది? -
రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-
ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంట్ ‘ప్రత్యేక’ సమావేశాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు
మణిపూర్ హింసాకాండతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి, సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. అయితే మణిపూర్ ఘటనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినా.. విపక్షాలు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్ర స్వరంతో నినాదాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్, టీఎంసీ సహా విపక్షాలు అన్నీ ఆందోళనకు దిగుతూ.. సభాకార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజూ మంగళవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ ఘటనపై పార్లమెంట్లో విపక్షాలు సృష్టిస్తోన్న రాద్దాంతంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ సహా సీనియర్ నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. చదవండి: జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై విరుచుకుపడ్డారు. కేవలం ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన సక్సెస్ కాలేరని విమర్శించారు. ఉగ్రవాద సంస్థ ‘ఇండియన్ ముజాహిద్దీన్’ లోనూ ఇండియా పేరు ఉందని, బ్రిటీష్ వారి ‘ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మనల్ని దోచుకున్నారని మండిపడ్డారు. దేశం పేరు చెప్పుకొని ప్రజలను తప్పుదోవ పట్టించలేరని దుయ్యబట్టారు. చదవండి: ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం? PM Shri @narendramodi and other senior leaders arrive for the BJP Parliamentary Party Meeting in New Delhi. pic.twitter.com/3Hk6q5wlwa — BJP (@BJP4India) July 25, 2023 విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయని మోదీ విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్షాల వైఖరి చూస్తుంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండాలనే కోరిక లేదన్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయినట్లుగా ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. #WATCH | LoP Rajya Sabha & Congress President Mallikarjun Kharge in Parliament, says, "So many representatives are giving notices under 267 in Parliament. We are talking about Manipur, but the Prime Minister is talking about East India Company" pic.twitter.com/rCpfn8JHPO — ANI (@ANI) July 25, 2023 ఇక ప్రధానిమోదీ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. తాము పార్లమెంట్ సాక్షగా మణిపూర్ సమస్య గురించి మాట్లాడాలని కోరుతుంటూ.. ప్రధాని మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో చాలా మంది ప్రతినిధులు నిబంధన 267 కింద నోటీసులు ఇస్తున్నారని, కాబట్టి పార్లమెంట్లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కకుపెట్టి, మణిపుర్ ఘటనపై చర్చ జరగాలన్నారు. ఈ అంశంపై కేవలం అరగంట చర్చ సరిపోదు తెలిపారు. -
షిఫ్ట్ పద్ధ్దతిలో పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది. 1952 తర్వాత ఇదే ప్రథమం..! రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17వ తేదీన సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తయితే, ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ అధికారులు రెండు వారాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సీట్ల అమరిక కారణంగా ఉభయ సభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లోనూ రాజ్యసభ సభ్యులు కూర్చుంటారు. రాజ్యసభ చాంబర్లో 60 మంది, గ్యాలరీల్లో 51 మంది, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్లో కూర్చుంటారు. 1952వ సంవత్సరం తర్వాత ఇలాంటి ఏర్పాటు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమమని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. భారీ డిస్ప్లే స్క్రీన్లు రాజ్యసభ చాంబర్లో 4 భారీ డిస్ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీల్లో కలిపి 6 చిన్న స్క్రీన్లు, గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్, సూక్ష్మక్రిములను చంపే అల్ట్రా వయొలెట్ పరికరాలు, ఆడియో విజువల్ సిగ్నల్స్ కోసం ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుళ్లు, అధికారుల గ్యాలరీని చాంబర్‌తో వేరు చేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ల అమరిక వంటివి ఇందులో ఉన్నాయని రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వీటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. సీట్ల అమరిక ఇలా... వివిధ పార్టీల సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభలో కొందరికి, మరికొందరికి లోక్‌సభలోని అధికార పక్షం, ఇతరులు కూర్చునే రెండు బ్లాకులను ప్రత్యేకించారు. రాజ్యసభ చాంబర్లో ప్రధానమంత్రి, విపక్ష, అధికార పక్షం నేతలు, ఇతర పార్టీల వారికి సీట్లు కేటాయించారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, రాజ్యసభ సభ్యులైన కేంద్ర మంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవలేలకు కూడా చాంబర్లోనే చోటు కల్పించారు. మిగతా మంత్రులకు అధికార పక్షం సభ్యుల సీట్లే కేటాయించారు. సభ్యులు తమ సీట్ల నుంచే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని సీట్లకు హెడ్ఫోన్లు, తదితర పరికరాలను అమర్చారు. రాజ్యసభలోని ప్రతి గ్యాలరీలో ఆయా పార్టీలకు కేటాయించిన సీట్ల వద్ద ప్లకార్డులను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసేందుకు ‘అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిమితంగానే అధికారులకు అవకాశం రాజ్యసభలోకి సెక్రటేరియట్‌కు చెందిన అధికారులను పరిమితంగా 15 మందినే అనుమతిస్తారు. అదేవిధంగా, విదేశీ ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక బాక్స్‌లో రిపోర్టర్లకు చోటు కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, 15 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలు కూడా ఉభయసభల్లో కార్యక్రమాలను ప్రస్తుతమున్న ఏర్పాట్ల ప్రకారమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీంతోపాటు, వివిధ అధికార పత్రాలను సభ్యులకు భౌతికంగా అందజేసే అవసరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఏర్పాట్లు చేçపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఫుడ్ పార్కు ఏర్పాటుపై లోక్ సభలో దుమారం
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో ఫుడ్ పార్కు ఏర్పాటు ఉపసంహరణపై లోక్ సభలో మంగళవారం దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదావేశారు. ఇటు రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యవహారం ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సభను అదుపులోకి తెచ్చే క్రమంలో చైర్మన్ రాజ్యసభను ముడుసార్లు వాయిదావేశారు. కాగా వివాదాస్పద భూ సేకరణ చట్టం సవరణ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 30 మంది సభ్యులతో ఏర్పాటయిన ఈ కమిటీకి డార్జిలింగ్ బీజేపీ ఎంపీ ఎస్ ఎస్ అహ్లువాలియా నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యుల్లో 20 మంది లోక్‌సభకు చెందినవారు కాగా, 10 మంది రాజ్యసభ సభ్యులు. కమిటీ ఏర్పాటును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ఏఐడీఎంకే పార్టీ తప్ప మిగతా పక్షాలన్నీ అంగీకరించడంతో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు రాజ్యసభ సెలెక్షన్ కమిటీ ముందుకు వెళ్లనుంది. గతంలో రూపొందించిన భూ సేకరణ బిల్లుకు ఎన్డీఏ చేసిన సవరణలు రైతులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించబోమని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్డీఏకు అంతగా బలంలేని రాజ్యసభలో భూ బిల్లు వీగిపోవడంతో మరోసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం ఎలాగైనా సరే బిల్లును ఆమోదింపజేయాలని పట్టుదలతో ఉంది. 15 లేదా 21 మంది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్షన్ కమిటీ జీఎస్టీ బిల్లును పరిశీలించనుంది.