
ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తాము వెనక్కి తగ్గే యోచనలో లేమనే విషయాన్ని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 100 శాతం పెట్టబడుల ఉపసంహరణ ఉంటుందన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌న సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటివరకూ 1017 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు రూ. 11,140 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఇప్పటివరకూ రూ. 984 కోట్లను విడుదల చేశాం’ అని మంత్రి తెలిపారు.