జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి.. పోలీసుల హైడ్రామా | Ibrahimpatnam police high drama over the incident at Jogi Ramesh house | Sakshi
Sakshi News home page

జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి.. పోలీసుల హైడ్రామా

Feb 2 2026 6:23 PM | Updated on Feb 2 2026 6:44 PM

Ibrahimpatnam police high drama over the incident at Jogi Ramesh house

సాక్షి,ఎన్టీఆర్‌: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై బాంబు దాడి ఘటనలో పోలీసులు హైడ్రామా క్రియేట్‌ చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై  పోలీసులు డమ్మీ  కేసులు నమోదు నమోదు చేశారు.  వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.  

ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటిపై వందలాది టీడీపీ గూండాలు దాడికి దిగారు. పెట్రోల్‌ బాంబులు విసిరారు. మారణాయుధాలు, రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. అయితే, జోగి రమేష్‌ ఇంటికి నిప్పు పెట్టి, దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురి అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం, వారిపై బెయిల్‌ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్‌ ఇంటిపై దాడి చేసేందుకు విజయవాడ నుంచి టీడీపీ గూండాలు వెళ్లడం,వారిని అరెస్టు చేసి బెయిల్‌ ఇవ్వడంపై  పోలీసులు క్రియేట్‌ చేసి హైడ్రామాను చూసి నవ్వుకోవడం ప్రజల వంతైంది.   

Advertisement
 
Advertisement
Advertisement