ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా అంటే ఇదేనేమో? | Target YSRCP Leaders Roja Asks CBN Over Rule Of Law | Sakshi
Sakshi News home page

ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా అంటే ఇదేనేమో?

Feb 2 2026 4:18 PM | Updated on Feb 2 2026 4:47 PM

Target YSRCP Leaders Roja Asks CBN Over Rule Of Law

చిత్తూరు, సాక్షి: అధికారం చేతుల్లో ఉందని అరాచకాలకు పాల్పడుతోంది తెలుగు దేశం పార్టీ. ఈ క్రమంలో వైఎ‍స్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతోంది. డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగానే ఈ దాడులని వైఎ‍స్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వైఎస్సార్‌సీపీ నేతలపై, ఆఫీస్‌లపై జరిగిన దాడులను నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రస్తావించారు. 

తాజాగా జరిగిన అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. గతంలో వలభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, సీనియర్‌ నేత ముద్రగడ, అలాగే మరో సీనియర్‌ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, చిత్తూరు రెడ్డప్ప నివాసాలపై జరిగిన దాడుల్ని ప్రస్తావించారామె. కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బయ్య చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై కూటమి పార్టీల శ్రేణులు దాడి చేశాయని గుర్తుచేశారు. 

దాడిశెట్టి రాజా, ఉప్పల హారికా-ఉప్పల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడితో పాటు విడదల రజిని.. దేవినేని అవినాష్ పై దాడికి యత్నించారని రోజా అన్నారు. మార్గాని భరత్ ఆఫీస్‌పై, నంబూరి శంకర్రావు ఆఫీసుపై,  హిందూపుర్ వైసీపీ ఆఫీస్‌లపై దాడి ఘటనలను ప్రముఖంగా ప్రస్తావించారు. వీటన్నింటితో పాటు తనపైనా ఆర్పీని(జబర్దస్త్‌ కిర్రాక్‌ ఆర్పీ) పెట్టి బూతుల తిట్టించారని అన్నారామె. 

ఇక.. డెక్కన్ క్రానికల్, సాకక్షి ఆఫీసులపై టీడీపీ అండ్‌ కో పార్టీలు దాడులు చేశాయని.. చంద్రబాబు చెబుతున్న రూల్‌ ఆఫ్‌ లా అంటే ఇదేనా? అని రోజా ప్రశ్నించారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement