‘కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం’ | Sajjala Ramakrishna Reddy condemns attack on Jogi Ramesh house | Sakshi
Sakshi News home page

‘కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం’

Feb 2 2026 4:52 PM | Updated on Feb 2 2026 6:09 PM

Sajjala Ramakrishna Reddy condemns attack on Jogi Ramesh house

సాక్షి,ఎన్టీఆర్‌ జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో టీడీపీ గూండాలకు పోలీసులకు రక్షణగా నిలిచారని వైఎస్సార్‌సీపీ సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఐదుగంటల పాటు పోలీసుల సమక్షంలో అరాచకం రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. 

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీం పట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంపై టీడీపీ గూండాల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిపై   పరామర్శించేందుకు జోగి రమేష్‌ ఇంటికి సజ్జలతో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. గుంటూరు పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేశారు. గుంటూరులో టీడీపీ గూండాలు ఏం చేశారో రాష్ట్రప్రజలు చూశారు. టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణగా ఉన్నారు. అంబటిని కలిసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు యత్నించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతల్ని అడ్డుకున్నారు. మాజీ హోంమంత్రి ఫోన్‌ చేసినా పోలీసులు స్పందించలేదు. బాధితుడినే పోలీసులు అరెస్టు చేశాను. మా నేతలను ఎస్పీ కార్యాలయంలో ఎదుట గంట సేపు ఎదురు చేయించారు. 

ప్లాన్‌ ప్రకారం అంబటి రాంబాబు,జోగి రమేష్‌ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. టీడీపీ గూండాలను పోలీసులు కంట్రోల్‌ చేస్తున్నట్లు యాక్ట్‌ చేశారు. జోగి రమేష్‌ కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’. అంబటి,జోగి రమేష్‌ ఇళ్లపై దాడులు చేసిన గూండాలపై కేసులు పెట్టలేదు. దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టలేదు. కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం. కూటమి అరాచకాల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. చంద్రబాబు వైఎస్సార్‌సీపీ శ్రేణులు,నేతల్ని బెదిరింపులు, దాడులు చేసి బెదిరించాలని అనుకోవద్దు. అలా అనుకుంటే భ్రమే అవుతుంది’అని  వ్యాఖ్యానించారు. 

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Advertisement
 
Advertisement
Advertisement