రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి | Bike Accident At Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Feb 2 2026 8:33 PM | Updated on Feb 2 2026 8:37 PM

Bike Accident At Rajahmundry

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దీంతో, బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

వివరాల మేరకు.. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం సాయంత్రం రెండు పల్సర్‌ బైక్‌లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రాజమండ్రి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement