సాక్షి,గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందా? అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. అందుకు ఇవాళ గుంటూరులో జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్ వేదికైందని గుసగుసలాడుకుంటున్నారు.
సోమవారం గుంటూరులో జనసేన జనరల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు. లడ్డూ వ్యవహారంలో తిప్పికొట్టలేకపోతున్నామంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం నుంచి వెళ్లిపోయారు.


