
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్‌లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనేది ఇంకా ఆన్‌లోనే ఉందని సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్‌కు హాజరైన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.
అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ
ఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్‌లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.
మూడు స్థాయిల్లో మాస్టర్ కావాలి..
యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు.
కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టింది.
మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఈఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది.
ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది.
భారత్ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. భారత్ ఆర్మీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్.