ఢాకా: దాయాది పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. పాకిస్తాన్‌కు చెందిన కీలక నేతలు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తాజాగా పాకిస్తాన్‌కు చెందిన నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాక్ నేవీకి చెందిన యుద్ధనౌక, PNF SAIF.. నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. ఈ విషయాన్ని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది. అయితే, 1971 తర్వాత పాక్ యుద్ధనౌక బంగ్లాదేశ్ సందర్శించడం ఇదే తొలిసారి. ఇది పాక్ కొత్త ఎత్తుగడగా భారత్ భావిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌తో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పాక్.. బంగ్లాదేశ్ ద్వారా మన దేశాన్ని చుట్టుముట్టాలని కుట్ర పన్నుతోందని సమాచారం.
ఇదిలా ఉండగా.. కెప్టెన్ షుజాత్ అబ్బాస్ రాజా నేతృత్వంలోని జుల్ఫికార్-క్లాస్ ఫ్రిగేట్ పిఎన్ఎస్ సైఫ్ (FFG-253) సద్భావన పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టుకు యుద్ధనౌక చేరుకుంది . పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీన్ అష్రఫ్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి అధికారిక పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లో ఉన్న సమయంలో ఈ సందర్శన జరిగింది. మరోవైపు.. గత అక్టోబర్ ప్రారంభంలో పాక్ సైన్యంలో రెండో అత్యున్నత సైనిక కమాండర్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్‌ను సందర్శించారు. మీర్జా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్‌తో సమావేశమయ్యారు.
Pakistan Navy ship PNS SAIF commanded by Captain Shujaat Abbas Raja, arrived at Chattogram Port. The ship was warmly received on behalf of Commander Chattogram Naval Area.
This goodwill visit is expected to further strengthen the friendly relations between Bangladesh & Pakistan. pic.twitter.com/ajqCerieRP— Defense Technology of Bangladesh-DTB (@DefenseDtb) November 8, 2025


