పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు | Pakistan Defence Minister Khawaja Asif Says War with India “Cannot Be Ruled Out” — Remarks Spark Debate | Sakshi
Sakshi News home page

పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Oct 8 2025 11:54 AM | Updated on Oct 8 2025 12:52 PM

Pak Minister Khawaja Asif Sensational Comments On India

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌(Pakistan) రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌(Asim Khwaja) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌India vs Pakistan) మధ్య యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.

పాక్‌ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ తాజాగా పాకిస్తాన్‌కు చెందిన సమా టీవీలో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌, భారత్‌ మధ్య నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. కానీ, రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను తిరస్కరించడం లేదు. మళ్లీ భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. యుద్ధం విషయానికి పాకిస్తాన్‌ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తాం. భారత్‌ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కాదని చరిత్ర చూపిస్తుంది. ఔరంగజేబు పాలనలో మాత్రమే ఐక్యంగా ఉంది. ముందు నుంచి పాకిస్తాన్ వేరుగానే సృష్టించబడింది. స్వదేశంలో మేము వాదించుకుంటాం.. పోటీ పడతాం. కానీ, భారత్‌తో పోరాటం అంటే మాత్రం మేము అందరం కలిస్తే వస్తాం అంటూ బీరాలు పలికారు. దీంతో, వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది. పాకిస్తాన్‌ ప్లాన్‌ ఏంటి? అని సోషల్‌ మీడియాతో పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇక, అంతకుముందు కూడా భారత్‌పై పాకిస్తాన్‌(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్‌ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్‌(India) సమాధి అవుతుందని కామెంట్స్‌ చేశారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్‌కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ 0–6 స్కోర్‌తో ఓడిపోయిందని అన్నారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్‌ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi)హెచ్చరించిన తర్వాత ఖవాజా ఇలా వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement