
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వెల్లడించారు.
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో జరిగిన నష్టాన్ని జైష్ ఎ మొహమ్మద్ (జెఈఎం) కమాండర్ అంగీకరించిన రెండు రోజుల తర్వాత, అదే కమాండర్ షేర్ చేసిన మరొక క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ భారత ఆపరేషన్‌లో మరణించిన పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని ఉన్నతాధికారులకు సూచించారని చెప్పడం వినవచ్చు.
🚨🚨🚨 Exclusive:
DG ISPR asked for linkage between Bhawalpur and Jaish-e-Muhammad
His partner in terror Jaish commander Ilyas Kashmiri confirms: "GHQ (Pakistan Army chief) ordered his Generals to attend funerals of terrorists eliminated in Bahawalpur Jaish camp during… pic.twitter.com/MzA4KmYKxu— OsintTV 📺 (@OsintTV) September 16, 2025
ఈ వీడియోలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హతమైన ఉగ్రవాదులకు నివాళులు అర్పించే దేశ నేతలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో జైష్ ఎ మొహమ్మద్ పాత్ర ఉందని భారత్ ఇంకా ఆధారాలు సమర్పించలేదని ఆయన చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. కాగా మే 7న బహవల్పూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారత క్షిపణి దాడుల్లో ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం నాశనమయ్యిదని కశ్మీరీ అంగీకరించారు. కాగా అసిమ్ మునీర్ ఆదేశాల దరిమిలా పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్, పోలీసు సీనియర్ అధికారులు ఉన్నత అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు.