
దైవభక్తికి తోడుగా దేశభక్తి
ఆకట్టుకుంటున్న దసరా కళాకృతులు
దేశవ్యాప్తంగా దేశభక్తి పెల్లుబుకేలా చేసిన ఆపరేషన్ సింథూర్ ఇప్పుడు దైవభక్తిలో సైతం మిళితమయ్యాయి. గత వినాయక చవితి ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా అనేక మండపాలు ఇదే థీమ్‌ను ఎంచుకోగా ఈ సంవత్సరం దుర్గా పూజ వేడుకలు లోతైన భక్తి జాతీయతా వాదాన్ని మిళితం చేశాయి, ప్రతీ సంవత్సరం గొప్ప కళాత్మకత సామాజిక స్పృహ కలిగిన థీమ్‌లకు ప్రసిద్ధి చెందిన సెంట్రల్ కోల్‌కతాలోని దుర్గా పూజ కమిటీ, తన 56వ సంవత్సరపు నవరాత్రి వేడుకల్ని కూడా అంతే వైవిధ్యంగా నిర్వహిస్తోంది. భారతదేశ సాయుధ దళాల ధైర్యం త్యాగాలకు నివాళులర్పించడానికి ‘ఆపరేషన్ సింథూర్‘ థీమ్‌తో ఒక భారీ వైవిధ్య భరిత మండపాన్ని ఆవిష్కరించింది. సెంట్రల్ అవెన్యూను రవీంద్ర సరణిని కలిపే చారిత్రాత్మక ప్రదేశం తారా చంద్ దత్తా వీధిలోని ఈ శక్తి ప్రతిబింబ మండపం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.


ప్రముఖ చిత్ర, కళాకారుడు దేబ్‌శంకర్ మహేష్ రూపొందించిన ఈ పండల్‌లో థీమ్‌కు ప్రాణం పోసే అనేక ఆకర్షణీయమైన కళాకృతులు కొలువుదీరాయి ఈ మండపం ప్రాంగణంలో , సందర్శకులు భారత ఆర్మీ ట్యాంకులు క్షిపణుల సజీవ ప్రతిరూపాలను సందర్శించవచ్చు. ఈ థీమ్ ముఖ్యాంశం దేశంలోని ఇద్దరు ధైర్యవంతులైన మహిళలు, భారత సైన్యానికి కీర్తిని తెచ్చిన కల్నల్ సోజియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యాజ్మా సింగ్‌లకు నివాళిగా కూడా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. అక్కడ కొలువుదీరిన వారి విగ్రహాలు సైన్యంలో మహిళల బలం నాయకత్వానికి శక్తివంతమైన చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ మండపంలో కొలువు దీరిన దుర్గాదేవి విగ్రహాన్ని శిల్పి కుష్ధ్వా బేరా సృష్టించారు.


ఈ సందర్భంగా యంగ్ బాయ్స్ క్లబ్ చీఫ్ ఆర్గనైజర్ రాకేష్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ‘దుర్గా పూజ మాకు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ప్రజలను కలిపి ఉంచే భావోద్వేగం. ప్రతి సంవత్సరం, సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, మా పెవిలియన్ ద్వారా లోతైన సందేశాన్ని అందించే థీమ్‌ను కూడా ఎంచుకోవడానికి మేం ప్రయత్నిస్తాం.‘ అని చెప్పారు. ‘‘ఈ సంవత్సరం థీమ్, ‘ఆపరేషన్ సింథూర్‘, ధైర్యం అంకితభావంతో మన దేశాన్ని రక్షించే మన దేశ సైనికులకు మా గౌరవప్రదమైన సమర్పణ. ఈ సంవత్సరం పండుగ ద్వారా, మేం వారి శౌర్యాన్ని వేడుకగా జరుపుకుంటున్నాము సందర్శకులలో మన సైనిక శక్తి పట్ల గర్వం దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యం’’ అంటూ వివరించారు.


ఈ సందర్భంగా యంగ్ బాయ్స్ క్లబ్ యూత్ ప్రెసిడెంట్ వికాంత్ సింగ్ మాట్లాడుతూ, ‘ మన దేశాన్ని అచంచలమైన అంకితభావంతో రక్షించే మన సైనికుల ధైర్యం త్యాగానికి ఇది మా సెల్యూట్ . ఈ సంవత్సరం థీమ్ మన సాయుధ దళాల లోని ధైర్యవంతులైన పురుషులు మహిళలకు నివాళి’’ అని చెప్పారు.

