
ఢిల్లీ: ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final 2025)లో దాయాది పాకిస్తాన్‌ను భారత్ (Team India) మరోసారి మట్టికరిపించింది. ఫైనల్ అద్భుతంగా ఆడి.. టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొమ్మిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. భారత్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు.
ఆసియా కప్‌లో భారత్ విజయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితం అని పేర్కొన్నారు. మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. భారత్ మళ్లీ గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు అని పోస్టు చేశారు.
#OperationSindoor on the games field.
Outcome is the same - India wins!
Congrats to our cricketers.— Narendra Modi (@narendramodi) September 28, 2025
ఇక, పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్(India vs Pakistan) ఫైనల్ ఉత్కంఠ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో భారతీయులు సంబురాలు చేసుకున్నారు. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ.. ‘ఆపరేషన్ తిలక్’తో దాయాదిని చిత్తు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
After Operation Sindoor... it was Operation Tilak 🇮🇳
Battlefield or cricket field - India’s victory over Pakistan comes every time... pic.twitter.com/zGu4vkZMcN— PoliticsSolitics (@IamPolSol) September 28, 2025
