breaking news
Ind vs pak final match
-
తిలక్ ఆట అద్భుతం.. భారత్ విజయంపై వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఆసియా కప్ ఫైనల్ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్వితీయ విజయం సాధించిన మన క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణ నైపుణ్యం, అంకితభావం.. జట్టు కృషి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఫైనల్లో కీలక ప్రదర్శన, సీరిస్‌లో అద్భుత ప్రతిభ కనబరించిన తెలుగు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు(Tilak Varma) ప్రత్యేక అభినందనలు. వర్మ ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడారు. Hearty congratulations to our cricket team on their outstanding victory in the Asia Cup 2025 final against Pakistan! Your exceptional skill, dedication, and teamwork have made the entire nation proud.A special shoutout to our very own Telugu star, @TilakV9, for his crucial… pic.twitter.com/GWexoLzkSt— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2025 -
పాకిస్తాన్‌పై భారత్ విజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ఢిల్లీ: ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final 2025)లో దాయాది పాకిస్తాన్‌ను భారత్ (Team India) మరోసారి మట్టికరిపించింది. ఫైనల్ అద్భుతంగా ఆడి.. టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొమ్మిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. భారత్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు.ఆసియా కప్‌లో భారత్ విజయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితం అని పేర్కొన్నారు. మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. భారత్ మళ్లీ గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు అని పోస్టు చేశారు.#OperationSindoor on the games field. Outcome is the same - India wins!Congrats to our cricketers.— Narendra Modi (@narendramodi) September 28, 2025ఇక, పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్(India vs Pakistan) ఫైనల్ ఉత్కంఠ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో భారతీయులు సంబురాలు చేసుకున్నారు. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ.. ‘ఆపరేషన్ తిలక్’తో దాయాదిని చిత్తు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. After Operation Sindoor... it was Operation Tilak 🇮🇳Battlefield or cricket field - India’s victory over Pakistan comes every time... pic.twitter.com/zGu4vkZMcN— PoliticsSolitics (@IamPolSol) September 28, 2025 -
ఆపరేషన్ ‘తిలక్’.. ఫైనల్లో పాక్‌ను మట్టికరిపించిన భారత్ (ఫొటోలు)
-
అతను మ్యాచ్ ఫినిషర్: కోహ్లీ
లండన్: చాంపియన్ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. హార్ధిక్ అమూల్యమైన ఆటగాడని కితాబిచ్చాడు. ఎటువంటి సందర్భంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్నవాడని పొగిడాడు. పాండ్య అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించగల సత్తా ఉన్నవాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 5బంతుల్లో9 పరుగులు, పాకిస్తాన్ మ్యాచ్‌లో 6బంతుల్లో 20పరుగులు చేశాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడని కెప్టెన్ తెలిపాడు. టీంలో సీనియర్ ఆటగాళ్లు, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సమీలను తీసుకోవాలని చాలా మంది ప్రశ్నించారని విరాట్ తెలిపాడు. తాను మాత్రం మొండిగా పాండ్యాకే ఓటు వేసినట్లు చెప్పాడు. పాండ్యాకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని భావించినట్లు కోహ్లీ తెలిపాడు. కీలక సమయంలో మ్యాచ్ ఫినిషర్‌గా ఉపయోగపడుతున్నాడని పేర్కొన్నాడు. లక్ష్య ఛేదన చేయాల్సి వచ్చినప్పుడు ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్ సామర్థ్యం ఉండాలన్నాడు. ఆ సమయంలో హార్ధిక్ జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా ఉన్నవాడు. ఫీల్డింగ్ విషయంలోను విశేషంగా రాణిస్తున్నాడని విరాట్ పొగిడాడు. చాంపియన్ ట్రోఫీలో తన ప్రదర్శన బాగానే ఉందన్నాడు, కీలక సమయంలో వికెట్లు తీసి రాణిస్తున్నాడంటూ వెనుకేసుకొచ్చాడు. చివరి యుద్ధంలో జట్టును మార్చే యోచన లేదని కోహ్లీ తెలిపాడు.