
ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా టోర్నీ చరిత్రలో 9వ సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... శివమ్ దూబే (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు సామ్సన్ (21 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు.
























