
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ యాత్ర వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆదివారం నుంచి యాత్ర తిరిగి మొదలుకావాల్సి ఉంది. అయితే, రెండు రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో యాత్రను వాయిదా వేసినట్లు శనివారం ఆలయ బోర్డు తెలిపింది.
యాత్రను తిరిగి ప్రారంభించే తేదీని వాతావరణం మెరుగయ్యాక ప్రకటిస్తామని ఆలయ బోర్డు వివరించింది.ఆగస్ట్ 26వ తేదీన వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి 34 మంది భక్తులు చనిపోగా, 20 మంది గాయపడటం తెల్సిందే. అప్పటి నుంచి యాత్రను 19 రోజులుగా ఆపివేశారు.