ముష్కరుల వేటలో భారత్‌కు సహకరిస్తాం  | Will support India as it hunts for those responsible for Pahalgam attack | Sakshi
Sakshi News home page

ముష్కరుల వేటలో భారత్‌కు సహకరిస్తాం 

Apr 26 2025 5:19 AM | Updated on Apr 26 2025 5:19 AM

Will support India as it hunts for those responsible for Pahalgam attack

తులసీ గబ్బార్డ్‌ హామీ

వాషింగ్టన్‌: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది హిందువులను పొట్టనబెట్టుకున్న ముష్కరుల వేటలో భారత్‌కు తమ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్డ్‌ స్పష్టం చేశారు. 

దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా సానుభూతి ప్రకటించారు. దాడికి కారకులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్‌కు సాయంగా నిలుస్తామని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధ వారం ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. దారు ణాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement