
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో ఆపరేషన్ అకాల్ తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాల ప్రయత్నించాయి. శుక్రవారం రాత్రి ఎదురుకాల్పుల్లో భాగంగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
Operation AKHAL, Kulgam | Lance/Naik Pritpal Singh and Sepoy Harminder Singh made supreme sacrifice.
Indian Army expresses deepest condolences and stands in solidarity with the bereaved families. Operation continues: Chinar Corps, Indian Army pic.twitter.com/WtabIZ6Mf0— ANI (@ANI) August 9, 2025