Kashmir: హురియత్‌ దుకాణం బంద్‌.. వేర్పాటువాదుల నోటికి తాళం | Hurriyat Shop is Closing in Jammu Kashmir 2 Factions have Given up Separatism | Sakshi
Sakshi News home page

Kashmir: హురియత్‌ దుకాణం బంద్‌.. వేర్పాటువాదుల నోటికి తాళం

Mar 26 2025 7:57 AM | Updated on Mar 26 2025 8:50 AM

Hurriyat Shop is Closing in Jammu Kashmir 2 Factions have Given up Separatism

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో హురియత్(Hurriyat) దుకాణం  మూతపడనుంది. ఇక్కడి జనం వేర్పాటువాదానికి స్వస్తిపలికి, భారత రాజ్యాంగంపై తమ విధేయతను ప్రకటిస్తున్నారు. కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు వేర్పాటువాదానికి ముగింపు పలికేలా కనిపిస్తున్నాయి. హురియత్ కాన్ఫరెన్స్‌లోని భాగస్వామ్య పార్టీలైన జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జేకేపీఎం), జే అండ్‌ కే డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్ (జేకేకేపీఎం) ఇకపై వేర్పాటువాదంతో తమకున్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ఇది భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని అమిత్ షా  పేర్కొన్నారు. జేకేపీఎంకు షాహిద్ సలీం నాయకత్వం వహిస్తుండగా, జేకేడీపీఎంకు న్యాయవాది షఫీ రేషి సారధ్యం వహిస్తున్నారు. ఇటీవల షాహిద్‌ సలీం తాను, తన సంస్థ వేర్పాటువాద భావజాలానికి దూరం అయ్యామని, భారతదేశ రాజ్యాంగంపై విధేయతను కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.
 

ఎన్‌డీటీవీ అందించిన కథనంలోని వివరాల ప్రకారం సలీం, రేషి నిర్ణయాలను స్వాగతించిన కేంద్ర హోం మంత్రి షా(Union Home Minister Shah) మాట్లాడుతూ వారు తీసుకున్ననిర్ణయం భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని, ప్రధాని మోదీ ప్రభుత్వంలోని సమైక్యత విధానాలు జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని అంతం చేశాయని అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ‘ఎ‍క్స్‌’ ఖాతాలో రాశారు. శాంతియుతమైన సమగ్ర భారతదేశాన్ని నిర్మించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలకు అందిన అతి పెద్ద విజయం  ఇది అని అమిత్ షా  పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement