
నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్ బాటిల్ కొంటే రూ. 200 డిస్కౌంట్. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.
एक बोतल शराब लीजिए, उसके साथ एक फ्री..
उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है. वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी. इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं. Video नोएडा का है.#Noida pic.twitter.com/lXZqadqzCd— NDTV India (@ndtvindia) March 25, 2025
ఎన్‌డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్ దొరకగానే ఏదో జాక్‌పాట్ తగిలినట్లు ఆనందించారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్ ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.
యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు