
కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విష యమై నాలుగు వారాల్లోగా సమాధాన మివ్వా లని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వి నోద్ చంద్రన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర హోదాను పునరుద్ధరి స్తామంటూ ఇచ్చిన హామీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక– రాజకీయ ఉద్యమకా రుడు అహ్మద్ మాలిక్ తదితరులు తమ పిటిషన్లలో కోరారు. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామంటూ హామీ ఇచ్చిందని పిటిషనర్లు గుర్తు చేశారు. ఈ విషయంపై నాలుగు వారా ల్లోగా స్పందించాలని ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.