
హోం మంత్రి అమిత్ షా వెల్లడి
జమ్మూ: దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను మోహరిస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవా దుల అక్రమచొరబాట్లను తిప్పికొట్టేందుకు, సరిహ ద్దుల్లో అండర్‌గ్రౌండ్ టన్నెళ్లను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. సరిహ ద్దుల కు ఆవలి వైపు ఎలాంటి అనుమా నాస్పద కదలి కలున్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడికి ఆయన చేరుకు న్నారు.
ఈ సందర్భంగా కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ‘వినయ్’ బోర్డర్ పో స్టును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న బీఎస్‌ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థమంతంగా నిర్వహిస్తున్న జవా న్లను ఆయన ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా 365 రోజు లూ బోర్డర్ పోస్టుల్లో విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంటూ ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి చూసిన వారికే జవాన్ల కష్టం ఏమిటో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు.
అమరుల సంతానానికి ఉద్యోగాలు
అనంతరం మంత్రి అమిత్ షా రాజ్‌భవన్‌లో ఉగ్రవాదులతో పోరాటంలో నేలకొరిగిన 10 మంది పోలీసులు, ఒక ఇంజనీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కారుణ్య ప్రాతిపదికన మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కథువా జిల్లాలో పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో నేలకొరిగిన నలుగురు పోలీసు కుటుంబాల వారు కూడా వీరిలో ఉన్నారు. వీరమరణం పొందిన జశ్వంత్ సింగ్ కుమారుడు 12 ఏళ్ల యువరాజ్ సింగ్ కూడా కారుణ్య నియామక పత్రం అందుకున్నాడు. మేజర్ అయ్యాక ఇతడి నియామ కానికి అనుకూలమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు.