జమ్ముకశ్మీర్‌లో ప్రమాదం.. భారత జవాన్లు మృతి | Army Vehicle Accident At Jammu Kashmir | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ప్రమాదం.. ముగ్గురు జవాన్లు మృతి

May 4 2025 1:52 PM | Updated on May 4 2025 2:49 PM

Army Vehicle Accident At Jammu Kashmir

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతిచెందారు. వివరాల ‍ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 

రాంబన్‌ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. ఆర్మీ వాహనం 700 అడుగుల లోత్తైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం జమ్ము నుంచి కశ్మీర్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement