ప్రశాంత్‌ కిషోర్‌కు గాయం.. విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిక | Prashant Kishor hit by vehicle during roadshow in Bihar | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ కిషోర్‌కు గాయం.. విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిక

Jul 19 2025 7:34 AM | Updated on Jul 19 2025 7:34 AM

 Prashant Kishor hit by vehicle during roadshow in Bihar

పాట్నా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడ్డారు. పీకే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడంతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌లోని ఆరా జిల్లాలో బద్లావ్ సభకు రోడ్ షోగా వెళ్లారు. ఈ సమయంలో ఆయన పక్కటెముక భాగంలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో, పీకే విలవిల్లాడిపోయారు. అనంతరం, వైద్య చికిత్స కోసం పీకేను పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, ఆయన గాయంతో బాధపడుతూ నడవలేకపోతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement