
ముంబై: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనేది నానుడి. ఇది భవిష్యత్ మహా రాజకీయాల్లో నిరూపితం కానుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రతిపక్షనేత ఉద్ధవ ఠాక్రేకు బంపరాఫ్ ఇచ్చారు. మళ్లీ తమతో కలిసిపోవచ్చంటూ ఆహ్వానించారు. దీంతో పాత మిత్రులు మళ్లీ ఒక్కటి కానున్నారా? అన్న ప్రచారం జోరందుకుంది.
బుధవారం మహారాష్ట్ర శాసన మండలిలో జరిగిన అంబదాస్ డాన్వే (ఉద్ధవ్ ఠాక్రే శివసేన విభాగానికి చెందిన ప్రతిపక్ష నేత) వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్ధవ్ జీ 2029 వరకు మాది అధికార పక్షమే. కానీ మీరు మా వైపు రావాలనుకుంటే ఆలోచించుకోండి. అది మీపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఫడ్నవీస్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలోని సభ్యుల మొహాల్లో నవ్వులు పూయించేలా చేశాయి. కానీ రాజకీయంగా దీని వెనుక ఉన్న వేరే ఉద్దేశ్యం ఉందన్న చర్చలు మొదలయ్యాయి. ఫడ్నవ్ ఆహ్వానంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఫడ్నవీస్ ఆహ్వానం సరదాగా చెప్పిన మాట. అంతే’ అని అన్నారు
కాగా, గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, 2022లో విభజన తర్వాత ఆయన శివసేన (UBT) నేతగా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. ఫడ్నవీస్ చేసిన ఈ రాజకీయ పరమైన కామెంట్లు భవిష్యత్తులో పాత మిత్రులు మళ్లీ కలవవచ్చన్న సంకేతాలు పంపినట్లైంది. పాత మిత్రుల మధ్య మళ్లీ పొత్తు పొడిస్తే మహా రాజకీయాలు మలుపులు తిరగనున్నాయి. అయితే… ఇదంతా ఊహలు మాత్రమే. నిజంగా పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.
देवेंद्र फडणवीस ने कहा - उद्धव जी, 2029 तक कोई स्कोप नहीं है! #MaharashtraCM #DevendraFadnavis #mansoonsession2025 #AssemblySession #UddhavThackeray #SSUBT pic.twitter.com/62dLFKNXiQ
— Aaj Ke Devendra Kal Ke Narendra (@AajKDKalN) July 16, 2025