బీహార్‌లో ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నేత దారుణ హత్య | Bihar BJP Leader Gopal Khemka death At Patna House | Sakshi
Sakshi News home page

బీహార్‌లో ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నేత దారుణ హత్య

Jul 5 2025 8:12 AM | Updated on Jul 5 2025 10:18 AM

Bihar BJP Leader Gopal Khemka death At Patna House

పాట్నా: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీహార్‌లో​ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కాపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గోపాల్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి పాట్నాలోని తన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంటి వద్ద కొందరు దుండగులు.. ఆయనపై కాల్పులు జరిపారు. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పనాచే హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. గోపాల్‌.. హోటల్‌కు ఆనుకుని ఉన్న ట్విన్ టవర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. నిందితుడు ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో గోపాల్‌ ఖేమ్కా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సిటీ ఎస్పీ దీక్ష మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కాపై కాల్పులు జరిగినట్టు మాకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఈ హత్య వెనుక కారణం ఇంకా తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ఇదిలా ఉండగా.. ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. మరోవైపు.. పూర్నియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో ఎవరూ సురక్షితంగా లేరు. బీహార్ నేరస్థులకు స్వర్గధామంగా మారింది. నితీష్ జీ.. దయచేసి బీహార్‌ను విడిచిపెట్టండి. గుంజన్ ఖేమ్కా హత్యకు గురైనప్పుడే నేరస్థులపై చర్యలు తీసుకుని ఉంటే.. ఈరోజు గోపాల్ ఖేమ్కాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement