
సాహసంతో కూడిన పర్యాట ప్రదేశాలను ఇష్టపడుతుంటారు కొందరూ పర్యాట ఔతసాహికులు. అలాంటి వారు తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలివి.వాటిలో కొన్ని ఉత్కంఠను, ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని వెన్నులో వణుకుతెప్పించే ఘోస్ట్‌లకు నిలయమైన ప్రదేశాలు

భంగర్ కోట, రాజస్థాన్: ఈ కోటను సందర్శిస్తున్నప్పుడు రకరకాల వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. ప్రతి సందర్శకుడు వాటిని వింటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత సందర్శన నిషిద్ధం.

డుమాస్ బీచ్, గుజరాత్ : అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటి. చూడటానికి అత్యంత అందమైన ప్రదేశం. హెచ్చరిక బోర్డు దాటి వెళ్తే అంతే సంగతులు

శనివర్ద కోట, పూణే:18వ శతాబ్దంలో పేష్వాలు నిర్మించిన కోట ఇది. రాత్రిపూట ఒక యవరాజు దెయ్యం రూపంలో సంచరిస్తుంటాడని చెబుతుంటారు. అందువల్ల పగటిపూటే ఈ కోటను సందర్శించాలి

జీపీ బ్లాక్, మీరట్: ఇదొక శిథిలమైన ఇల్లు. ఇక్కడ మూడు దెయ్యాలు మద్యం సేవిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయని అంటుంటారు. దూరం నుంచే సందర్శించి వెనుదిరగాలి.

డిసౌజా చాల్, ముంబై: అత్యంత ఇంట్రస్టింగ్ బావి. దీని నిర్మాణం కూడా విచిత్రంగా ఉంటుంది. అయితే ఇక్కడొక స్త్రీ దెయ్యంలా సంచరిస్తుంటుందని చెబుతుంటారు. పైగా రాత్రి సమయంలో ఎవ్వరూ అటుగా సంచరిచరు కూడా.