
వాహన చోదకులకు శుక్రవారం చుక్కలు కనిపించాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని నగరవాసి విలవిల్లాడాడు. లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహావిష్కరణ, ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సమావేశం.. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఆయా మార్గాల్లో వాహనాలు ముందుకు కదల్లేకపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించి నరకాన్ని తలపించింది.
















