రౌడీషిటర్‌తో కౌన్సిలర్‌ వివాహేతర సంబంధం | vck female councillor incident | Sakshi
Sakshi News home page

రౌడీషిటర్‌తో కౌన్సిలర్‌ వివాహేతర సంబంధం

Jul 5 2025 9:37 AM | Updated on Jul 5 2025 11:11 AM

 vck female councillor incident

తమిళనాడు: వీసీకే మహిళా కౌన్సిలర్‌ దారుణ హత్యకు గురైంది. రౌడీషిటర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్‌తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్‌ను భర్త దారుణంగా హతమా ర్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్‌ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్‌ 26వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్‌రాజ్‌(38) తిరునిండ్రవూర్‌ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. 

వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్‌రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్‌ రామదాస్‌పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్‌ మోసస్‌దేవతో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రెండు నెలల క్రితం మోసస్‌దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్‌ సెల్‌ఫోన్‌కు పంపినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి.  ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్‌రాజ్‌ ప లుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో  గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమ ది బయలుదేరింది. 

అజిత్, స్టీఫెన్‌రాజ్‌ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్‌దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్‌రాజ్‌ గుర్తించి  ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  ఇది చూసి రౌడీ షీటర్‌ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్‌ కమిషనర్‌ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్‌రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement